అంతు చిక్కని వ్యాధి: ఏడుగురు చిన్నారుల మృతి
Published on: Sat Jul 12, 2014 4:44PM

పశ్చిమ బెంగాల్‌లో అంతు చిక్కని వ్యాధులు చిన్నారులను కబళించడం మామూలైపోయింది. ఆమధ్య లిచి పళ్ళని తినడం వల్ల ఆరుగురు చిన్నారులు పశ్చిమ బెంగాల్‌లో మరణించారు. ఇప్పుడు అదే రాష్ట్రంలోని మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు అంతుచిక్కని వ్యాధితో మరణించారు. వీరిని ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే వాళ్లందరి ఆరోగ్యం చాలా విషమించిందని వైద్యులు చెబుతున్నారు. ఏ వ్యాధి కారణంగా ఈ పిల్లలు మరణించారో ఇప్పుడే చెప్పలేకపోతున్నామని వారు అంటున్నారు.


