TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిప్పంటించిన యువతి.. ఏడుగురు సజీవదహనం

Published on: Wed May 20, 2015 11:27AM

తమిళనాడు మధురై జిల్లా తిరుమంగళంలో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఓ యువతి ఇంటికి నిప్పంటించడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కుటుంబ గొడవలవల్ల భర్త తనని చాలా రోజుల నుండి కాపురానికి పిలవడం లేదనే కోపంతో ఆ ఇంటి కోడలే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ కోపంతో అందరూ నిద్ర పోతున్న సమయంలో ఇంటికి నిప్పటించింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త, అత్త మామలతోపాటు ఏడుగురు సజీవదహనం అయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.