TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో కారుకు బ్రేక్ లేస్తున్న కమలనాథులు

Published on: Fri Apr 13, 2012 10:26AM

తెలంగాణా సెంటిమెంటుపై గుత్తాధిపత్యం చెలాయించిన తెలంగాణ రాష్ట్రసమితికి బిజెపి గట్టిపోటీదారు కానుంది. ఇటీవల మెహబూబ్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టి.ఆర్.ఎస్.ను ఎదిరించి అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. దీంతో కమలనాథులు (బిజెపి) కాదనకుతూహలంతో టి.ఆర్.ఎస్.పై వాగ్వుద్దాన్ని ప్రారంభించారు. తెలంగాణా రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమం టి.ఆర్.ఎస్. సొత్తేమీ కాదు అని బిజెపి నాయకులు అంటున్నారు. టి.ఆర్.ఎస్.కు సరైన వ్యూహం కానీ, ప్రత్యేక రాష్త్రాన్ని తెచ్చే బలంగానీ లేదని బిజెపి నాయకులు అంటున్నారు. టి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన ఇద్దురు, ముగ్గురు ఎంపీలు తెలంగాణను ఎలా తీసుకురాగాలుగుతారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎప్పటికైనా ప్రత్యేక తెలంగాణాను ఇచ్చేది బిజెపి మాత్రమేననీ, ఈ విషయాన్నీ గమనించే మహబూబ్ నగర్ జిల్లా ఓటర్లు టి.ఆర్.ఎస్. అభ్యర్థిని కాదని తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని వారు అంటున్నారు. త్వరలో జరగబోయే పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి పోటీ చేసి విజయఢంకా మొగిస్తుందంటున్నారు. టి.ఆర్.ఎస్. తెలంగాణా ఉద్యమం పేరుతొ ఇప్పటికే తెలంగాణా ప్రాంతానికి ఎంతో అన్యాయం చేసిందని కూడా వారు విమర్శిస్తున్నారు. నిజానికి తెలంగాణా ఉద్యమంలో బిజెపి, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు కూడా చురుగ్గానే పాల్గొంటున్నారు. కొంతకాలం క్రితం ట్యాంక్ బండ్ పై ఉన్న ప్రముఖుల విగ్రహాల ద్వంసంలోనూ బిజెపి కార్యకర్తలే కీలకపాత్ర పోషించారు.