నామా విశ్వసనీయతపై సందేహాలు
Published on: Sat Apr 7, 2012 6:46AM
ప్రత్యేక తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు పెడితే తొలి ఓటు తెలుగుదేశంపార్టీదే అని తెలుగుదేశంపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ తీర్మానం లేకపోయినా పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రేస్ పార్టీ ఒకవేళ ప్రత్యేక తెలంగాణా కోసం పార్లమెంటులో బిల్లు పెడితే పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆయన తెలంగాణకు అనుకూలంగా ఓటు చేస్తారా? తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం మాట ఏమిటి? రెండు కళ్ళలో ఒక కంటిని చిదిమేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ప్రత్యేక తెలంగాణ పేరిట పార్లమెంటులో ఆందోళన చేసినా, తన నియోజకవర్గంలో గంభీరమైన ప్రసంగాలు చేస్తున్నప్పటికీ నామా నాగేశ్వరరావును తెలంగాణ ప్రజలు విశ్వసించటం లేదు. నామా వ్యాపార మూలాలన్నీ కోస్తాంధ్ర ప్రాంతంలో ముడిపడివుండటమే అందుకు కారణం.


