TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందుకే కేసీఆర్ తెరగమరుగయ్యారా! టీజీ

Published on: Mon Dec 26, 2011 12:14PM

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో కొన్నేళ్ళుగా ప్రజలను మోసం చేస్తూ తన రాజకీయ శక్తిని పెంచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుపై రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ నిప్పులు చెరిగారు. జనాన్ని ఏదో ఒకటి చెప్పి నమ్మించి రెచ్చగొట్టిన కేసీఆర్ తన కుతంత్రాలను తెలుసుకున్న తెలంగాణ ప్రజలు తిరగబడి తంతారనే విషయాన్ని గ్రహించి తెరమరుగయ్యారన్నారు. ఆయన కర్నూలులో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు కారణంగా రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేసమయంలో కేసీఆర్ భావించినట్టుగా ఏదీ జరగక పోవడంతో ఆయన ప్రజలకు దూరమయ్యారని విమర్శించారు. సకల జనుల సమ్మె కారణంగా ఫిబ్రవరి, మార్చి వరకు పుష్కలంగా ఉండాల్సిన విద్యుత్ వర్షాకాలంలోనే కోతలు విధించేంత స్థాయికి తగ్గిపోయిందని టీజీ గుర్తు చేశారు.