తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాల్సిందే...
Published on: Sat Aug 2, 2014 5:58AM
.jpg)
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందినన్యాయవాదులు విధులను బహిష్కరించి 'ఛలో హైకోర్టు' కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలోని చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించి ప్రత్యేక హైకోర్టు కావాలంటూ, మా రాష్ట్రం, మా కోర్టు అంటూ నినాదాలతో కోర్టు ఆవరణ దద్దరిల్లిల్లేలా చేశారు. పోలీసులు న్యాయవాదులను అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు న్యాయవాదులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తిరుమలరావు, మాణిక్ప్రభులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.


