TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేతులెత్తేసిన సుజనా చౌదరి... సంక్షోభంలో మహా టివి

Published on: Thu Mar 29, 2012 9:42AM

సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావు ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభించిన మహా టివి తెలుగు న్యూస్ ఛానెల్ సంక్షోభంలో పడింది. మహా టివి యాజమాన్యం గత మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో దాదాపు సగంమంది సిబ్బంది ఈ ఛానెల్ ను వదిలి వేరే దారి చూసుకున్నారు. ఇప్పటిదాకా ఈ ఛానెల్ కు సుజనా గ్రూప్ సంస్థల చైర్మన్ సుజనా చౌదరి ఫండింగ్ చేస్తూ వచ్చారు. ఆయన తాను మొదట ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం మూడేళ్ళపాటు ఈ ఛానెల్ కు నిధులు సమకూర్చారు. మూడేళ్ళు ముగిసిన తరువాత ఆయన వద్ద నుంచి నిధులు ఆగిపోవడంతో మహా టివి మహా సంక్షోభంలో పడింది. ఈ ఛానెల్ నిర్వహణకు నెలకు సుమారు రూ. కోటి 10లక్షల నుంచి రూ.కోటి 20లక్షల వరకు అవుతుంది. అయితే ఆదాయం మాత్రం నెలకు రూ. 60లక్షల నుంచి రూ. 70 లక్షలకు మించి రావడం లేదు. గతంలో కూడా ఇదే పరిస్థితి వున్నప్పటికీ సుజనా చౌదరి ఫండింగ్ తో ఐ.వెంకట్రావ్ ఛానెల్ ను నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆర్ధిక సహాయం నిలిచిపోవడంతో వెంకట్రావు ఇబ్బందుల్లో పడ్డారు. మహా టివి ఛానెల్ ను గట్టెక్కించే చర్యల్లో భాగంగా ఎక్స్ ట్రా అనే ఒక సినీ ఛానెల్ కూడా ఐ.వెంకట్రావు ప్రారంభించారు. సినీ ఛానెల్ కు డబ్బులు బాగా వస్తాయని ఆయన భావించి ఎక్స్ ట్రాను ప్రారంభించారు. అయితే ఎక్స్ ట్రా కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీంతో వెంకట్రావుపై మరో అదనపు భారం పడినట్లయింది.