TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీనియర్ కాంగ్రెస్ నేత కన్నుమూత.!

Published on: Tue Jul 7, 2026 11:22AM

 

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.  

నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

 Bhuvanagiri, Former, Mla, Values