సెల్ఫీ కోసం నెమలిని చంపేశారు

posted on: Jun 6, 2018 11:03AM

 

 

సెల్ఫీలను తీసుకునే ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేది భారతీయులే. ఈ లెక్క మనకి కొత్త కాదు. కానీ ఇప్పుడు జంతువుల ప్రాణాలు తీయడంలో కూడా మనవాళ్లే ముందుండేట్లున్నారు. పశ్చిమ బెంగాల్లోని బరిగోరియా అనే ఊళ్లోకి పాపం ఓ నెమలి దారి తప్ప వచ్చింది. ఆ నెమలితో ఫొటోలు దిగేందుకు కుర్రకారంతా ఎగబడ్డారు. దాన్ని కావలించుకుని ఒకరు, కాలు లాగి ఒకరు, ఈకలు పీకి ఒకరు రకరకాల ఫోజుల్లో ఫొటోలు దిగారు. చివరికి ఆ నెమలి కాస్తా చనిపోయింది. హతవిధీ!

google-ad-img
    Related Sigment News
    • Loading...