కేరళ వరదల్లో కూడా సెల్ఫీ పైత్యం

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ, ఏదైనా చూసినా సెల్ఫీ, నడుస్తున్నా సెల్ఫీ, ప్రమాదం జరిగినా సెల్ఫీ, ప్రమాదం జరగాలన్నా సెల్ఫీ .. అసలు ఈ సెల్ఫీ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.. అసలు ఈ సెల్ఫీ పైత్యం చూస్తుంటే కొన్నిసార్లు పిచ్చెక్కిపోతుంది.. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.

 

 

ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో కేరళ అల్లకల్లోలం అయిపోయింది.. కేరళ ప్రజలకు, సైనికులు విరామం లేకుండా సహాయం అందిస్తున్నారు.. దానిలో భాగంగానే కొందరు సైనికులు ఆర్మీ హెలికాఫ్టర్ లో వెళ్తుండగా.. ఒక యువకుడు రెడ్ క్లాత్ ఊపుతూ కనిపించాడు.. అయ్యో పాపం ప్రమాదంలో ఉన్నాడనుకుంటా అని అతికష్టం మీద హెలికాఫ్టర్ ని ల్యాండ్ చేసి, ఆ యువకుడి దగ్గరికి వెళ్లారు.. అప్పుడు ఆ యువకుడు ఏమన్నాడో తెలుసా?.. నేనే ప్రమాదంలో లేను, నాకు సహాయం అవసరం లేదు.. మీతో సెల్ఫీ దిగాలని పిలిచా అన్నాడట.. దీన్ని పిచ్చి అనాలో, ఇంకేమనాలో అర్ధంకావట్లేదు.. ఓ వైపు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తుంటే, వారికి సహాయం చేయాలని కష్టపడుతున్న ఆర్మీ వారిని ఇలా సెల్ఫీ పేరుతో పిలిచి వారి సమయం వృధా చేయటం ఎంత వరకు కరెక్ట్.. సెల్ఫీ దిగడంలో తప్పులేదు, కానీ దానికో సమయం సందర్భం ఉంటుందని తెలుసుకోపోవడం తప్పు.. ఎప్పుడు మారతారో ఏంటో ఇలాంటి జనాలు.