చిరంజీవి ముఠామేస్త్రి నిర్మాత మృతి
Published on: Sat Feb 25, 2017 9:21AM

ప్రముఖ సినీ నిర్మాత శేఖర్ బాబు కన్నుమూశారు. తెల్లవారు జామున గుండెపోటు రావడంతో హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. చిరంజీవి, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్తిని ఆయన నిర్మించారు. దాంతో పాటు సౌందర్య లీడ్ రోల్‌లో నటించిన చిలకమ్మ తదితర సినిమాలను శేఖర్ బాబు నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.


