TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

16 న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ట్రైలర్

Published on: Thu Dec 13, 2012 1:11PM

 

 

 

ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఈ నెల 16 న విడుదల చేయనున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో విడుదల నానక్ రామ్ గూడా లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించి ఆడియో రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.  ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది .


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది. సక్రాంతి కానుకగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.