సీమాంద్ర ఎంపిలకు సియం బుజ్జగింపులు

 

అధిష్టానం వైఖరితో రాజీనామాలకు సిద్దపడ్డ సీమాంద్ర ఎంపిలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు సియం. ఆదివారం క్యాంపు
కార్యాలయంతో తనతో కలిసిన నేతలతో ఇప్పుడే రాజీనామాలపై తొందరపడొద్దని తెలిపినట్టుగా సమాచారం. ఒకవేళ ఎంపిలు రాజీనామలు చేస్తే ఆ ప్రభావం మిగతా నేతలపైనా పడుతుందని అప్పుడు వారు తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పాడుతుందన్నారు.

రాజీనామాల వల్ల విభజన తీర్మానం అసెంబ్లీకి వచ్చినపుడు, కేభినెట్‌ నోట్‌ మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు, బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు సీమాంద్ర తరుపున పోరాడటానికి ఎవరూ ఉండరని నిర్ణయం ఏకపక్షంగా సాగుతుందని సీయం ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో బిల్లును సీమాంద్ర ఎంపిలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చిన్నరాష్ట్రాలను వ్యతిరేఖించే పార్టీలన్ని అండగా నిలుస్తాయని సియం హామి ఇచ్చారు. అధిష్టానం కూడా రాజీనామాలు చేసినా వెనక్కు తగ్గే పరిస్ధితి లేదని వివరించారు. ఒకవేళ రాజీనామాలు అనివార్యం అయితే అందరం కలిసే చేద్దామని సియం నేతలకు వివరించారు.