రాజీల్లేవ్‌ రాజీనామాలే


తెలంగాణ ప్రకటనతో కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.హైకమాండ్‌తో పాటు సీమాంద్ర నేతలు డీ అంటే డీ అంటున్నారు. తెలంగాణ ప్రకటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధిష్టానం తెగేసి చెపుతుండటంతో, సీమాంద్ర నేతలు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు.

ఇప్పటి వరకు రాజీనామాల విషయంలో దాటవేత దొరణి అవలంభించిన ఆ ప్రాంత ఎంపిలు ఇక రాజీనామలకే మొగ్గెతున్నారు. అందులో భాగంగానే మంగళ వారం స్పీకర్‌ను కలవనున్న ఏడుగురు లొక్‌సభ సభ్యులతో పాటు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా తమ రాజీనామాలను

ఆమోదింప చేసుకోనున్నారు. మొదట పదవులకు ఆ తరువాత పార్టీకి కూడా రాజీనామ చేయడానికి సిద్దమవుతున్నారు ఆప్రాంత నేతలు.మంగళవారం స్పీకర్‌ను కలవటానికి నిర్ణయం తీసుకున్న సీమాంద్ర నేతలే శాంతింప చేయడానికి సియం సహా పలువురు నేతలు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఎంపి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో రాజీనామాలు చేస్తామని పట్టుపడుతున్నారు. 2014లో వైసిపితో పొత్తుకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం, సీమాంద్ర కాంగ్రెస్‌ నేతల భవిష్యత్తును పణంగా పెడుతున్నట్టుగా భావిస్తున్నారట ఆ ప్రాంత నేతలు.