రణరంగంగా మారిన సీమాంద్రుల సమావేశం

 

తెలంగాణ, సమైక్య ఉద్యమాలతో హైదరాబాద్‌ రణరంగంగా మారుతుంది. సమైక్య వాదులు హైదరాబాద్‌ నగరంలో సమావేశాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ వాదులు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సమావేశా ప్రాంగణాలలో యుద్ద వాతావరణం కనిపిస్తుంది.

ఆదివారం సాయంత్రం సీమాంద్ర న్యాయవాదులు  సమైక్యాంద్ర పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపి ఎన్టీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు, నగర అధ్యక్షుడు పివీవీ సత్యానారాయణ పాల్గొన్నారు.ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు సంభందించిన చర్చించారు.

అయితే సమావేశం ప్రారంభమై 20 నిమిషాలు కాగానే తెలంగాణ ప్రాంతానరి చెందిన కొందరు లాయర్లు ఏపిఎన్జీవోల సమావేశం జరిగే ప్రాంతానికి వచ్చి పెద్ద ఎత్తున తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సీమాంద్ర న్యాయవాధులు కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో, ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి.

వివాదం మరింత ముదిరి కుర్చీలతో దాడి చేసుకునే వరకు వెళ్లారు ఇరుపక్షాల వారు. గొడవ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ముందుగానే అక్కడి వచ్చిన పోలీసులు వారిని వారించి పంపించే ప్రయత్నం చేశారు. అయినా పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో 13 మంది తెలంగాణ న్యాయవాదులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తరువాత బెయిల్‌నై విడుదల చేశారు.