అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ఎంపీలు..!

 

 

 

తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఏర్పడదు. అసలు యూపీఏ ప్రభుత్వాన్నే ఉండనివ్వం. ప్రభుత్వాన్ని పడగొడుతున్నాం. మేము చేస్తున్న ప్రయత్నాలకు అనూహ్యమయిన మద్దతు లభిస్తుంది అని మీడియా ముందు గతంలో యుపిఎ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లగడపాటి ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నారు.

 

తాజాగా ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన కేంద్రంలో కొనసాగుతున్నది మైనార్టీ ప్రభుత్వం అని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం అనేక రకాలుగా వ్యూహాత్మకంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.



సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందునే తాము ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వలేదన్నారు. కేంద్రం విభజనపై ఎలా ముందుకు వెళ్తుందో చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం పాటుపడుతున్నారన్నారు. జనవరి దాకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం లేదన్నారు.