ఇంతకీ నానేటి సెపుతున్నాఅంటే... ఏట్నేదు-2

 

"ఆ.. ఇంతకీ నా పేరేటో సెప్పనే నేదు కదూ... నా మాటలు అరదం కాకున్నా నానేటి అనుకోను. గానీ ఎవులు నువ్వు? నీ పెరేటిది. ఏ వూరు మనది? అని సిల్లర పెస్నలు అడిగితే నాకు మా సెడ్డ సిరాకు."

 

"నాకయితే రాష్ట్రం ఇడిపోతేనే ముక్కెమంతిరి అయ్యే శాన్సు ఉంది. గనుక బేగి ఇడిపోవాలని ఆ భగమంతుడిని ఏడుకొంటా! గానీ, ఆ ఇసయం పైకి సెప్పనేను గదా! అందుకే ఇట్టం నేకపోయినా సమేకం...సమేకం... అని గుంపుతో బాటు నాను కేకలేతుంటా. అంత మాత్రాన్న సమేకం కావాలని నాను పట్టిడుపులు నేకుండా మాటాడే మూర్కుడ్ని గాను నేను."

 

"నాకే ముక్కే మంతిరి కుర్సీ ఖాయం సేసేత్తే ఈ రాష్ట్రం కలిసున్నా ఇడిపోయినా నాకు సమ్మతమే. కానీ, కలిసుంటే ఈ తెలంగానోల్లు నన్నుఆ సీయం కుర్సీలో సల్లగా కూకోనిత్తారా ఏటి? ఆ డవుటే నేదు! అందుకే ఎంత బేగి ఇడిపోతే అంత మేలు నాకు. కితం సారి వెంకన్న కొండకి ఎల్లినప్పుడు భగమంతుడా.. నానే ఆ కుర్సీలో కూసోనేలా సేయి దేముడా...ఎయ్యి కొబ్బరికాయలు గొడతా నీకు, మరాపని రాష్ట్రం ఇడదీసేసి సేసెత్తాతవో నేక ఏటిసేత్తవో నాకు మాతరం తెల్దు. నాను మాత్రం బేగి ముక్కేమంతిరి అయిపోవాల..సల్లగా సూడు సామీ.. అని గట్టిగా ఏడుకొని మరీ వచ్చినా."

 

ఆ పని మీదే నిన్న మా కాంగిరేసోల్లందరినీ ఓ కాడ కూకోపెట్టి మన రాష్ట్రం గురించి అమ్మకి ఏటి సెప్దారి? అని అడిగినానా.. ఆల్లు నానే అదేదో తీరమానం సేసేత్తాననుకొన్నారో ఏటో ఎర్రి నాయాల్లు... ఓ.. ఒక్కోల్లు రద్దీ కాగితాల కట్టల మాదిరి ఇంతేసి దొంతరలు కాగితాలు ఒట్టుకొచ్చేసి  నాసేతిలో ఎట్టేసి. ఇక ఎల్లు! మళ్ళీ మరో పాలి ఆ ఇమానం ఎక్కి డిల్లీ ఎల్లి అమ్మకి మా మాటగా సెప్పిరా... అని నన్ను ఈ ఇమానంలో కూకోబెట్టినారు."

 

"ఒకడేమో ఇడిపోవలంటాడు.మరోడేమో కలిసి సద్దారి అంటాడు...నాను తెనుగులో ఇడమరిసి సేపితేనే అరదం సేసుకోలేని ఈ ఎర్రి బాగుల జనాలకి తెనుగులో అచ్చరం ముక్క రాని ఆయమ్మ మాతరం ఈల్లకి ఎట్టా సర్ది సెప్పగలదు? నా ఎర్రి గాకపోతేను?"

 

"అయినా మనకీ గోలంతా ఎందుకు? కలిసి సత్తారో నేక ఇడగొట్టుగొట్టుకొని సత్తారో అదంతా మనకనవసరం. మంది ఆరడుగుల బులెట్ మాదిరి ఒకటే ముక్క. ఒకటే పెశ్న. ఆ సీయం కుర్సీ నాకిత్తావా నేదా? అంతే మరో ముక్కనవసరం. అవుసరమనుకొంటే రాష్ట్రాన్ని మరో నాలుగు ముక్కలు సేసేసుకొన్నా నాకేటి అభేంతరం నేదు. కుర్సీ మాత్రం శానా ఇంపాటెంట్ మనకి అంతే. ఈ ముక్క ఆయమ్మకి బాగానే నచ్చజేపినా. కానీ ఈ ఎర్రి బాగుల జనాలకే అరదం అయ్యేనా సెప్పనేక తల పెనం తొక్కి వస్తోంది...స్సీ.. సీ..”

 

"సార్! డిల్లీ వచ్చేసాము. లేవండి. సార్! నిద్ర లేవండి..."