నేడు సీమాంద్రలో రహదారుల దిగ్బందం

 

50 రోజులు దాటినా ఇంకా సీమాంద్రలో ఉద్యమాల హోరు తగ్గకపోగా మరింత ఉదృతం అవుతున్నాయి. ఈ నెల 16న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు నాయకులు. అందులో భాగంగానే మంగళవారం సీమాంద్ర లో రహాదారుల దిగ్బందించి, బంద్‌ పాటిస్తున్నారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాలనుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అడ్డకోవటం ద్వారా సమస్య, ఉద్యమ తీవ్రతలు కేంద్రానికి తెలియజేయాలని భావిస్తున్నారు. ఈ రహదారుల దిగ్బందం తిరుమల వెళ్లే భక్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కార్యక్రమంలో అన్ని జేఎసిల నాయకులతో పాటు ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొనాలని సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు.