TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్సార్ కుటుంబానికి భద్రతకు ఆదేశం

Published on: Thu Sep 11, 2014 2:48PM

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం భద్రత కావాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్‌లు తమ భద్రత కోసం కోర్టుకెళ్లారు. ప్రభుత్వం వీరికి వున్న భద్రతను ఉపసంహరించుకోవడంతో తమకు ప్రాణహాని వుందని ఈ ముగ్గురూ కోర్టును ఆశ్రయించారు. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ఈ ముగ్గురికీ భద్రతను కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.