కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన భయం.. భద్రత పెంపు
Published on: Fri Jun 14, 2019 5:15PM

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, తమకు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదని తెలిపారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఇద్దరికి 4+4 గన్మెన్లను కేటాయించారు.


