TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పూర్తి బాధ్యత పవన్ దే అంటోన్న పోలీసులు!

Published on: Sat Aug 27, 2016 12:06PM

మనమందరం కారు దిగినట్టే సినిమా హీరోలు కూడా కారు దిగుతారు! కాని, వారికుండే ఇమేజ్, గ్లామర్ వల్ల వేలాది జనం గుమిగూడిపోతారు! అంతే కాదు, మనం చేస్తే సిగ్నేచర్ అంటారు. హీరోలు చేస్తే ఆటోగ్రాఫ్ అంటారు! ఇదంతా వాళ్లకున్న పాలోయింగ్ వల్ల జరుగుతుంటుంది. పవన్ తిరుపతి బహిరంగ సభకు ఈ సినిమా గ్లామరే వరంగానూ, శాపంగానూ మారింది! అదెలా అంటారా? 

పవన్ కళ్యాణ్ కేవలం మూడు రోజుల వ్యవధిలో బహిరంగ సభ నిర్ణయం తీసుకున్నాడు. అయినా జనం వస్తారా లేదా అన్న డౌట్ లేదు ఎవ్వరికీ! అందుక్కారణం... పవన్ కున్న విపరీతమైన అభిమానం. కాని, అదే అభిమానుల వీరాభిమానం టెన్షన్ కూడా తెచ్చిపెడుతోంది. సభ జరిగే సమయంలో, అంతకు ముందు , తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవటం చాలా పెద్ద సమస్యే! అసలు ఇప్పటికే ఒక అభిమాని చనిపోయాడని ఏర్పాటు చేస్తోన్న సభలో ఏదైనా అపశృతి జరిగితే మరి కొందరి ప్రాణాలు అపాయంలో పడతాయి. అదే అన్నారట పోలీసులు కూడా... 


పవన్ సభకు పోలీసుల నుంచి అనుమతైతే వచ్చింది కాని అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవటం నిర్వాహకులే చూసుకోవాలని పోలీసులన్నారట! బలగాలు తగినన్ని లేవు కాబట్టి పవన్ భరోసా మీదే సభకు పర్మిషన్ ఇస్తున్నామన్నారట తిరుపతి పోలీసులు. అందుకే, ఎలాంటి విషాదం చోటు చేసుకోకుండా సభ ప్రశాంతంగా నడిడిచేందుకు పవన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. జనసేన వాలెంటీర్స్ గా పని చేస్తున్న ఫ్యాన్స్ కొందరు జనాన్ని కంట్రోల్ చేయటం పై దృష్టి పెట్టారట. ముఖ్యంగా వేదిక మీద పవన్ వున్నప్పుడు అభిమానులు తొసుకుని వచ్చేయకుండా వుండేందుకు రక్షణ కవచంలా ఏర్పడనున్నారట! 


సభలో పవన్ చేయబోయే రాజకీయ ప్రకటన మాటెలా వున్నా ఏ మాత్రం తేడా రాకుండా ప్రశాంతంగా మీటింగ్ జరిగేలా చూడటం నిజంగా పెద్ద సవాలే! దీన్ని మరి పవన్ ఫోర్స్ గా రంగంలోకి దిగిన జనసేన వాలెంటీర్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి...