TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రతకు లింకులు

Published on: Tue Aug 5, 2025 7:55PM

 

సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌ కోర్టులో గోపాలపురం పోలీసులు హాజరుపర్చారు. కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారు. పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. 

అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలు జరిపినట్టు నిర్దారించారు. . గతంలో పిల్లల్ని అమ్ముతూ.. అరెస్ట్ అయిన నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్క పిల్లాడిని రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలకు నమ్రత కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు. పిల్లల అమ్మకాలతో పాటు యువతి యువకులను కూడా నమ్రత గ్యాంగ్ ట్రాప్ చేసిందని చెప్పారు. 

యువతి , యువకుల వీర్యకణాలు అండాలను సేకరించి అమ్మేవారని పోలీసులు స్పష్టం చేశారు. నమ్రత ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్‌ హెడ్స్‌తో కథ నడిపించారు