సచివాలయంలో సమ్మెషురూ

 

రాష్ట్రన్ని సమైక్యగాం ఉంచాలని కోరుతూ 34 రోజులుగా భోజన విరామ సమయంలో వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ వచ్చిన సీమాంద్ర సచివాలయ ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగారు.

ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలతో పాటు, హైదరాబాద్‌లో వారి రక్షణకు ప్రభుత్వం  భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యంగ బద్దంగా ఉద్యోగాలకు ఎంపికైన తమకు సమ్మె చేసే హక్కును కూడా అదే రాజ్యంగం కల్పించిందన్నారు.

తెలంగాణ ప్రాంతానికిగాని అక్కడి ఉద్యోగులకు కాని తాము వ్యతిరేకం కాదని, కేవలం రాష్ట్ర విభజన జరిగితే తాము అన్యాయమవుతామనే సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని అలా తీసుకువరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టామన్నారు.