TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లంచం కోసం దళారి.. ఇంట్లో నోట్ల కట్టలు..!

Published on: Sat Aug 15, 2026 11:41AM

 

రైల్వే సీనియర్ డీఎంఈ అన్మోల్ ఉకే అరెస్ట్..!

లంచం తీసుకునేందుకు దళారిని రంగంలోకి దింపిన రైల్వే ఉన్నతా ధికారిని సీబీఐ రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) భిలాయ్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అన్మోల్ ఉకే లంచం కేసులో అరెస్టయ్యారు. ఫిర్యాదుదారుడికి సంబం ధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ అన్మోల్ ఉకే డిమాండ్ చేసినట్లు సీబీఐ వెల్లడిం చింది. అనంతరం జరిగిన చర్చల్లో ఆ మొత్తాన్ని రూ.1 లక్షకు తగ్గించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

అయితే..లంచం తీసుకునే సమయంలో నేరుగా చేతికి డబ్బు తీసుకోకుండా తనకు నమ్మకమైన దళారి ద్వారా డబ్బులు ఇప్పించేందుకు అధికారి పథకం వేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు.ఆగస్టు 13న రూ.50 వేల లంచం దళారి ద్వారా అందుకుంటున్న సమయంలో అన్మోల్ ఉకేను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. లంచం వ్యవహారంపై అరెస్టుతో ఆగకుండా సీబీఐ అధికారులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. 

రాయ్‌పూర్, భిలాయ్‌లోని అన్మోల్ ఉకే నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ సోదా ల్లో బయటపడిన నగదు చూసి అధికారులే అవా క్కయ్యారు. సుమారు రూ.77 లక్షల నగదు, మరో రూ.14 లక్షల విలువైన ఆభరణాలు గుర్తించినట్లు సీబీఐ వెల్లడించింది. లంచం కేసులో అన్మోల్ ఉకేను దళారితో పాటు ఆగస్టు 14న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాల్సి ఉందని సీబీఐ కోరగా, న్యాయ స్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. లంచం డిమాండ్ నుంచి దళారి ద్వారా వసూళ్లు, ఆ తర్వాత సీబీఐ వల.. చివరకు సోదాల్లో భారీగా నగదు, ఆభరణాలు బయటపడటంతో ఈ కేసు రైల్వే వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

SECR DME Anmol Uke arrested, South East Central Railway, Bhilai Division, CBI,Anmol Uke, indian railways