TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబేద్కర్  మాస్క్ సందేశం 

Published on: Mon May 17, 2021 3:04PM

కరోనా కట్టడికి, మూడు మూల సూత్రాలు.  అందులో మొదటిది ముఖానికి మాస్క్, రెండవడి మనిషికి ...మనిషికి మధ్య మూడడుగుల భౌతిక దూరం పాటించడం .. మూడవది, శానిటైజర్  లేదా సబ్భుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం. ఈ మూడు మూల సూత్రాల పట్ల ప్రజల్లో అవగాహన కలిపించేందుకు, ప్రధానమంత్రి మొదలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎవరికీ తోచిన రీతిలో వారు ప్రచారం చేస్తున్నారు. 

అదే దారిలో, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని జిల్లెలగూడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు మాస్కులు తొడిగారు, దళిత సంక్షేమ సమితి అధ్యక్షుడు ఓం ప్రకాష్, ఇతర సభ్యులు. ఐడియా బాగుంది. కరోనా సెకండ్ వేవ్, ఇంతలా విజృంభిస్తున్నా ఇప్పటికీ అనేక మంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని, అందుకే రోడ్లపై తిరిగే వారికి కనీసం అంబేడ్కర్‌ విగ్రహాన్ని చూస్తేనైనా అవగాహన కలుగుతుందనే ఆలోచనతో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు  మాస్కులు తొడిగినట్లు ఓం ప్రకాష్ చెప్పారు.

నిజానికి , కరోన టీకా (వాక్సిన్) రెండు డోసులు వేసుకున్నా సహా ప్రతి ఒక్కరు మాస్క్ తప్పక ధరించాలని, నిపుణులు చెపుతున్నారు. కాలికి జోడు లేకుండా ఒంటిన బట్టలు లేకుండా ఎలా బయటకు రామో, అలాగే, ముఖానికి మాస్క్ లేకుండా ఎవరూ బయతాకు రారాదు. ఇది టీకాలు వేసుకున్న వారికి  కూడా వర్తిస్తుంది.అయితే.టీకాలు వేసుకున్నవారు, వేసుకొని వారు కూడా, మాస్క్ లేకుండానే వీధుల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపు సమయంలో మార్కెట్లలో , మాల్స్’ లో మాస్కులు ధరించక పోవడమే కాదు, భౌతిక దూరాన్నిపాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఒక దగ్గర గుమ్మిగుడుతున్నారు.  చివరకు వాక్సిన్ సెంటర్ల వద్ద కూడా భౌతిక దూరం పాటించక పోవడం చూస్తూనే ఉన్నాం.  

తొలి విడత కరోనా కాసింత సర్డుమణగంగానే, జనాలు మాస్క్ మరిచిపోయారు. భౌతిక దూరం, చేతులు కడుక్కోవడం అన్నీ మరిచిపోయారు. సామాన్య ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాయి. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత షా, ముఖ్యమత్రి  కేసీఆర్, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు కూడా కరోన నిబంధనలను ఉల్లంఘించారు. అందుకే కరోనా సెకండ్ వేవ్, సునామీ సృష్టిస్తోంది. మరో వంక థర్డ్ వేవ్ తప్పదని వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితులలో కరోనా నియంత్రణకు, కరోనా జాగ్రత్తల విషయంలో ప్రజలకు అవగాహనా కలిపించేందుకు ఎవరు ఏ చిన్నప్రయత్నం చేసినా, అది అభినదనీయమే అవుతుంది.