TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీటుకోసం చంద్రబాబుకు ఉమ్మారెడ్డి మాప్

Published on: Sat Feb 4, 2012 11:02AM

హైదరాబాద్: తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలుగుదేశం సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తనకు సీటు ఇవ్వడం ద్వారా కాపు కులస్థుల్లో పార్టీ పట్ల విశ్వాసం కలిగించాలని  శుక్రవారం సాయంత్రం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఉమ్మారెడ్డి చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి. కాపులకు టీడీపీ పుట్టిల్లని, వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఇటీవల చంద్రబాబు నర్సాపురం వెళ్ళినప్పుడు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి తగిన అవకాశాలిస్తే.. వారిలో పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందని ప్రస్తుతం పార్లమెంటులో ఈ వర్గం నుంచి ఎంపీలు ఎవరూ లేరని, ఎమ్మెల్యేలు కూడా ఇద్దరే ఉన్నారని ఆయన చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే అది ఒక మంచి సంకేతం అవుతుందని ఉమ్మారెడ్డి అన్నారు. పార్టీ పట్ల అంకిత భావం ఉన్న ఉమ్మారెడ్డి అంటే తనకు అత్యంత గౌరవమని, కేంద్రంలో అవకాశం వచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం కల్పించానని చంద్రబాబు చెప్పారు.