కరోనా మరణాలకు కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

ప్రపంచవాప్తంగా మరణమృదంగం మోగిస్తూ రోజూ వేలాదిమంది ప్రాణాలు హరిస్తోంది కరోనా. యమపాశానికి ఎవ్వరైనా ఒక్కటే అన్న కర్కశత్వంతో సామాన్యల నుంచి సెలబ్రేటీల వరకు ఈ మహ్మమారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

 

సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, క్రీడాకారులు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాల్లో సంభవిస్తున్న మరణాలు కలచివేస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స అందించినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. దీంతో ప్రజల్లోనే కాదు  వైద్యసిబ్బందిలోనూ కరోనా  మరణాలకు కారణాలు అంతుచిక్కడం లేదు. ఈ విషయంపై అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.

 

కరోనా మరణాలకు కారణం శరీరంలోకి ప్రవేశించిన కోవిడ్ 19 వైరస్ యాంటీబాడీలు తప్పుదోవ పట్టించి వారి రోగ నిరోధక వ్యవస్థపైనే దాడిచేస్తుందట. మరో కారణం లోప భూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు అన్నది శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

 

కరోనా బారినపడినప్పటికీ కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడం, మరికొందరు కోలుకున్నప్పటికీ తిరిగి అనారోగ్యం పాలు కావడం వెనుక జీన్స్ మ్యూటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. శరీరంలోని యాంటీబాడీలను కూడా తప్పుదోవపట్టించేలా ఉంటున్నాయన్నారు. దీని కారణంగా సహజసిద్ధంగా మనిషిలో ఉండే రోగనిరోధకశక్తిలో భాగమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్ ఐ ఇంటర్ ఫెరాన్’ లోపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను వెల్లడిస్తూ  ' వైరస్‌లు దాడిచేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ముందే  టైప్ ఐ ఇంటర్ ఫెరాన్లు  రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.  అయితే, కొవిడ్ 19 వైరస్  తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొందరి శరీరంలోని యాంటీబాడీలు ఈ ఇంటర్‌ ఫెరాన్లను నాశనం చేస్తున్నాయి. మరికొందరిలో జన్యు ఉత్పరివర్తనల వల్ల యాంటీ బాడీస్  సరిపడా ఉత్పత్తి కావడం లేదు. ఈ కారణాలతోనే మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఎవరిలో ఏ విధంగా వైరస్ ప్రభావం ఉంటుందో అంచనా వేయడం కష్టం ' అన్నారు.