TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూర్యుని చుట్టూ రంగుల వ‌ల‌యం.. ఎలా సాధ్యం? సైన్స్ ఏం చెబుతోంది?

Published on: Wed Jun 2, 2021 4:07PM

ఆకాశంలో రంగుల వ‌ల‌యాన్ని అంతా ఆశ్చ‌ర్యంగా చూశారు. రోజూ చూసే సూర్యున్ని వింత‌గా, ప్ర‌త్యేకంగా చూశారు. ఇంద్ర‌ధ‌న‌స్సును ఇన్నాళ్లూ అర్థ చంద్ర‌కారాంలో మాత్ర‌మే చూసుంటారు. తొలిసారిగా పూర్తి వృత్తాకార రంగుల వ‌ల‌యాన్ని చూసిన వారంతా అవాక్క‌య్యారు. అరే.. భ‌లే ఉందే అంటూ ట‌కాట‌కా ఫోటోలు తీసేశారు. సోష‌ల్ మీడియాలో స్టేట‌స్‌ల‌తో హోరెత్తించారు. 

ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేసిన వాళ్లు కొంద‌రైతే.. ఆ సంపూర్ణ ఇంద్ర‌ధ‌న‌స్సు ఎలా ఏర్ప‌డుతుంద‌ని ఆరా తీసిన‌వారు మ‌రికొంద‌రు. వాటిని 22డిగ్రీ వృత్తాకార వలయాలు అంటార‌ని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

హైద‌రాబాద్‌లో వ‌ర్షం కుర‌వ‌డంతో ఆ అద్భుతం సాధ్య‌మైంది. వాతావరణంలో ఉండే నీటిబిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు.. తెల్ల‌ని కాంతి రంగులుగా విడిపోయి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఒక్కోసారి సూర్యుడి చుట్టూ రంగురంగుల‌ వృత్తాకార వలయాలు ఏర్పడుతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం నుంచి సూర్యున్ని చూస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్థం 22 డిగ్రీలుగా ఉంటుంది. 

గాల్లోని నీటి బిందువుల ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు.. అది వక్రీభవనంతో పాటు పరావర్తనం చెంది మెరవడం వల్ల ఇలాంటి వృత్తాలు కనిపిస్తాయి. ఇంద్రధనస్సు ఏర్పడే మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ, అలాగే చంద్రుడి చుట్టూ ఏర్పడుతుంటాయి. సూర్యుని చుట్టూ ఏర్ప‌డితే 'స‌న్ హాలో' అని.. చంద్రుడి చుట్టూ కనిపించే వృత్తాలను ‘మూన్‌ రింగ్‌’గా పిలుస్తారు. 

ప్ర‌స్తుతం ఆకాశంలో ఆవిష్కృత‌మైన ఆ అద్బుతం.. 'స‌న్ హాలో'. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాద‌మూ లేదు. ఎలాంటి పుకార్ల‌నూ న‌మ్మ‌వ‌ద్ద‌ని.. హాయిగా ఎంజాయ్ చేయొచ్చ‌నేది సైంటిస్టులు మాట‌.