సంపులో పడి బాలుడు మృతి
Published on: Wed Aug 13, 2014 6:05PM

ప్లే స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ళ బాలుడు నీటి సంపులో పడి మరణించాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ దారుణం జరిగింది. వనస్థలిపురంలోని ఓ ప్లే స్కూల్‌లో వచన్ రెండున్నరేళ్ళ బాలుడిని తల్లిదండ్రులు చేర్పించారు. బుధవారం ఉదయం వచన్ స్కూలు సంపులో పడిపోయాడు. అయితే ఆ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో బాలుడు మరణించాడు. ఆ తర్వాత గుర్తించిన స్కూలు యాజమాన్యం వచన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్కూలు యజమానులు స్కూలుకు తాళం వేసి పారిపోయారు.


