Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వర్గీకరణ చంద్రబాబు పుణ్యమే.. మందకృష్ణ మాదిగ!
posted on: Aug 1, 2024 2:23PM
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పుణ్యం చంద్రబాబు నాయుడిదేనని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ స్పందించారు. ‘‘షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ తీర్పు వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే వున్నారు. ఆనాడు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేవి కావు. విద్యావకాశాలు వచ్చేవి కావు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల న్యాయం బతికింది అంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన చట్టంవల్లే జరిగింది’’ అని మందకృష్ణ మాదిగ అన్నారు.


.webp)
.webp)


