రోజా మీద ఎట్రాసిటీ కేసు
Published on: Thu Sep 25, 2014 3:48PM
.jpg)
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఎక్కడకి వెళ్తే అక్కడ గొడవలు జరిగేట్టు వున్నాయి. మొన్నామధ్య తన నియోజకవర్గంలోని ఒక దేవాలయానికి హారతి తీసుకోవడానికి రోజా వెళ్ళిన సందర్భంగా గొడవ జరిగింది. ఆ గొడవలో రోజా చేతికి గాయమై రక్తం కూడా వచ్చింది. తాజాగా ఆమె మరో గొడవలో తల దూర్చారు. నగరి శాసన సభ్యురాలు రోజా నగరి జాతర సందర్భంగా తమను కులం పేరుతో దూషించారని కొంతమంది ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రోజా మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.


