TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్టీ,ఎస్సీ అట్రాసిటీ కేసు

Published on: Wed Dec 9, 2020 10:20AM

రిపోర్టర్ ను బండ బూతులు తిట్టిన పటాన్ చెరు టీఆరెఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై  ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. 109,448,504,506, 3(2)(va) SC ST POA ACT 2015 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  తన పై భూకబ్జా వార్తలు రాసినందుకు విలేకరిని ఫోన్లో బెదిరించారు ఎమ్మెల్యే . విలేకరి సంతోష్ అంతు చూస్తానంటూ బెదిరించిన ఎమ్మెల్యే ఆడియో లీకై వైరల్ గా మారింది. మహిపాల్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపింది. దీంతో  విలేకరి పై రెచ్చిపోయి అసభ్యపెదజలంతో దూషించిన  మహిపాల్ రెడ్డిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.