నాలుగు సార్లకంటే ఉపయోగించాల్సిన అవసరం ఏముంది...
Published on: Thu Mar 9, 2017 10:34AM

ఏస్బీఐ తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విమర్శలపై స్పందించిన ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే ఎటువంటి మొహమాటం లేకుండా పెనాల్టీ చార్జీలు విధిస్తామని తేల్చి చెప్పారు. జన్‌ధన్ ఖాతాలకు మాత్రం ఇది వర్తించదని ఆమె పేర్కొన్నారు. ఈ ఖాతాల నిర్వహణ భారంగా మారడంతోనే కనీస నిల్వ ఆంక్షలు విధించామని, కనీస నిల్వ లేకుంటే జరిమానా చెల్లించక తప్పదన్నారు. అంతేకాదు ఓ గృహస్తుడు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం రాదని.. నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయోగించాల్సినంత అవసరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. ఖాతాదారులు తమ లావాదేవీల కోసం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.


