Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గ్యాస్ సిలిండర్ల గురించి భయపడకండి.. ఈ టిప్స్ తో గ్యాస్ ను ఆదా చేయండి..!
posted on: Mar 16, 2026 3:13PM
.webp)
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది.
వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
పాత్రల సెలక్షన్..
ఉపయోగించే వంట పాత్రల రకం కూడా గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి. ఈ పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా ఉంటే, వేడి వ్యాపిస్తుంద, వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది.
మీడియం ప్లేమ్..
అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని, గ్యాస్ వినియోగం తగ్గుతుందని అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది, ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు, బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా, సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది.
ప్రెజర్ కుక్కర్..
వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
మూత పెట్టి వండటం..
వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
బర్నర్..
బర్నర్ శుభ్రతపై శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
*రూపశ్రీ.






