అక్కడ అమ్మాయిలు స్కర్ట్ వేసుకుంటే..అంతే సంగతులా..?

ముస్లిం దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మహిళలకు బోలెడన్ని కట్టుబాట్టు.. సాంప్రదాయ వస్త్రధారణ చేయాలి..తల నుంచి కాలి వేళ్ల వరకు ఎదుటి వ్యక్తికి కనిపించకుండా బురఖా ధరించాలి. ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే శిక్షలు ఎలా ఉంటాయో ప్రపంచం మొత్తానికి తెలుసు..అలాంటి చోట ఒక యువతి స్కర్ట్ ధరిస్తే..మరి పోలీసులు ఊరుకుంటారా..? సౌదీ అరేబియాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ గ్రామంలోని వీధుల్లో ఓ యువతి స్కర్ట్, క్రాప్ టాప్ ధరించి తిరుగుతూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో సదరు యువతి ఎక్కువ సేపు వెనక్కి తిరిగే ఉంది..ఒకటి రెండుసార్లు మాత్రమే ముఖం చూసే అదృష్టం వీక్షకులకు కలిగింది. ఈ విషయం ఆనోటా..ఈ నోటా పోలీసుల చెవిన పడింది. అయితే ఆ యువతి ఎవరో..ఆ ప్రదేశం ఏంటో తెలియక వారు ఆయోమయానికి గురయ్యారు. కానీ కొందరు నెటిజన్లు యువతి నడిచిన ప్రాంతాన్ని గుర్తించారు..అది సౌదీ రాజధాని రియాద్ సమీపంలోని చారిత్రక ఉషౌఖిర్‌..రంగంలోకి దిగిన పోలీసులు యువతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటిదే కాదు ఇంకా చాలా ఆంక్షలు అక్కడి మహిళలపై ఉంటాయి.