సౌదీలో అగ్నిప్రమాదం..11 మంది భారతీయులు మృతి

సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలో ఉన్న నజ్రాన్ పట్టణంలోని ఓ నిర్మాణ సంస్థలో కొందరు భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు..పనులు ముగించుకుని సాయంత్రం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి..దట్టంగా పొగలు రావడంతో ఊపిరి ఆడక 11 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. నజ్రాన్ పట్టణంలో 40 వేలమందికి పైగా తెలుగువారు ఉండటంతో మరణించిన వారిలో తెలుగువారు ఉన్నారేమోనని భావిస్తున్నారు. మరోవైపు బాధితులకు సాయం చేసేందుకు జెడ్డా నుంచి భారత బృందం ఘటనాస్థలికి చేరుకుంది.