చంద్రబాబుతో సత్య నాదెళ్ళ భేటీ
Published on: Mon Dec 28, 2015 7:18AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఇఓ, తెలుగువాడు సత్య నాదెళ్ళ సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. విద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరపడానికే సత్య నాదెళ్ళ, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్టు సమాచారం.


