TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సత్యసాయి గురించి అమెరికా ఎలా ఫీలైందో తెలుసా...

Published on: Wed Jan 25, 2017 11:02AM

 

ఈ మధ్య ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు! మనం ఏం చేస్తున్నా ఎక్కడ్నుంచి ఏ కెమెరా చూసేస్తందో అర్థం కాని పరిస్థితి. కాని, ఇప్పుడే కాదు ఎప్పుట్నుంచో ప్రపంచం మొత్తాన్ని ఓ కంట గమనిస్తోన్న సీక్రెట్ కెమెరా ఒకటుంది! అదేంటో మీకు తెలుసా? అమెరికా!

 

అమెరికన్ సీఐఏ దృష్టి పడని దేశం అంటూ ఈ భూమ్మీద లేదు ఆఫ్రికా పేద దేశాలు మొదలు అంటార్కిటికా మంచు జీవుల వరకూ అన్నీ, అందరూ అమెరికాకు అవసరమే. ఎవ్వర్నీ , దేన్నీ వదలకుండా తన ఏజెంట్లను పంపిస్తూ వుంటుంది అమెరికా. ఈ సీఐఏ ఏజెంట్లు మన ఇండియా లాంటి అతి పెద్ద దేశాన్నీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థని వదిలిపెడతారా? నో వే... అందుకు తాజా ఉదాహరణ కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో బయటపడింది!

 

సీఐఏ మన దేశంపై దృష్టి పెడుతుందనేది బహిరంగ రహస్యమే. చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీలోనే దాని ఏజెంట్లు పని చేస్తుంటారంటారు. ఇక మన దగ్గర వుండటం ఆశ్చర్యం కాదు. అయితే, తాజాగా బయటపడ్డ పేపర్స్ లో అనూహ్యంగా సత్య సాయిబాబా పేరు వుంది! 1990 కాలం నాటి ఈ డాక్యుమెంట్స్ లో బాబా ప్రభావం తీవ్రంగా వుందని సీఐఏ ఏజెంట్ అమెరికాలోని హెడ్ క్వార్డర్స్ కి నివేదిక పంపాడు. సత్యసాయి చుట్టూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన భక్తులు పోగవుతున్నారని ఆయన అన్నాడు. దీని వల్ల ఒక కొత్త మతమే ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని చెప్పాడు!

 

పుట్టపర్తిలో సత్యసాయి అన్ని మతాల వార్నీ ఆకర్షించటం మనకు తెలిసిందే. మతాలకతీతంగా సరికొత్త మతం ఆవిర్భవించవచ్చనే సీఐఏ కూడా అభిప్రాయపడింది. సత్యసాయి మహిమలు కూడా రచయిత చెప్పుకొచ్చాడు నివేదికలో. ఆయన ఆభరణాలు, విభూతి లాంటివి గాల్లోంచి తీయటం, లింగాలు సృష్టించటం లాంటివి చేస్తూ భక్తుల్ని ఆకర్షిస్తున్నారని అన్నాడు.అయితే, అదే నివేదికలో బాబా మహిమలు నిజం కాదని కాల క్రమంలో తేలితే కొత్త మతం మొత్తానికి మొత్తంగా కుప్పకూలవచ్చని కూడా చెప్పబడింది! చివరకు, ఇంచుమించూ అలాంటిదే జరిగింది. పుట్టపర్తి ఇప్పుడు ఒకప్పటిలా వెలిగిపోవటం లేదు...

 

కేవలం సత్యసాయి మీదే కాదు 1940 నుంచి దాదాపు అయిదు దశాబ్దాలు అమెరికా ఇండియాపై ఎలా నిఘా పెడుతూ వచ్చిందని తెలిపే అనేక అంశాలు ప్రస్తుతం బయటపడ్డ డాక్యుమెంట్స్ లో వున్నాయి! మరి ప్రస్తుతం సీఐఏ మన దేశంలో దేన్ని గమనిస్తోందో!