లొంగిపోయిన శశికళ భర్త నటరాజన్...


అన్నాడీఎంకే బహిష్కృత జనరల్ సెక్రటరీ, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ భర్త ఎం.నటరాజన్.. 1994లో  బ్రిటన్ నుంచి విలాసవంతమైన కారు దిగుమతికి కేసులో సుంకం ఎగవేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ కేసులో నటరాజన్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోయారు. గత విచారణలకు ఆయన హాజరు కాలేదు. ఆరోగ్యపరమైన కారణాలను చూపించి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదే కేసులో చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2010లో నటరాజన్, మరో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గత నవంబర్లో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. దీంతో ఆయన కోర్టు ముందు లొంగిపోయారు.