శశికళ భర్త ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా...!

 

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ తీవ్ర అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. అతని కిడ్నీ, లివర్ పూర్తిగా పాడైపోయానని... దాతల కోసం ఎదురుచూస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ప్రాణాలు ఓ కూలీ నిలబెట్టినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం... తమిళనాడులోని పుదుకోట జిల్లా అరంగాంగి సమీపంలోని కూత్తాడివయన్ అనే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు కార్తీక్ ఓ ప్రింటిగ్ ప్రెస్ లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 30న తన స్నేహితుడి బైక్ పై వెళుతుండగా ఓ కారు అతడని బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన కార్గీక్ ను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా... బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక కార్తీక్ తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకోవడంతో కార్తీక్ అవయవాలను నటరాజన్ సహా ముగ్గురు రోగులకు అమర్చారు. నటరాజన్ కు కిడ్నీలు, కాలేయాన్ని అమర్చారు.