జైల్లో శశికళకు ఉత్తరాలు.. తిడుతూ, శపిస్తూ...
Published on: Thu Mar 23, 2017 1:04PM

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో భాగంగా ఆమె జైలుపాలయ్యారు. అయితే ఇప్పుడు జైలులో ఉన్న శశికళకు తెగ ఉత్తరాలు వస్తున్నాయట. ఆ ఉత్తరాలు పార్టీ నేతలో.. లేక ఆమె బంధువులో రాసినవి కాదట. ఆమెను తిడుతూ పలువురు రాస్తున్నారట. శశికళ, సెంట్రల్ జైల్, పరప్పణ అగ్రహార, బెంగళూరు - 560100 అడ్రస్ కు ఈ లేఖలు వచ్చాయి. తమిళనాడులోని దిండిగల్, కరూర్, తిరుచిరాపల్లి, మధురై, ధర్మపురి, సేలం, చెన్నైల నుంచి వచ్చాయని జైలు సిబ్బంది తెలిపారు. అందులో జయలలిత హత్యకు శశికళే కారణం అని.. జయ అనారోగ్యంతో చనిపోలేదని... ప్రణాళిక ప్రకారమే కుట్ర పన్ని చంపేశారని రాశారట. అంతేకాదు తమకు ఎంతో ఇష్టమైన అమ్మను చంపిన నీవు... ఓ వెన్నుపోటుదారువి అంటూ.. నీవు చేసిన దారుణాలకు అంతకంతా అనుభవిస్తావని... క్షణక్షణం నరకయాతన అనుభవిస్తావంటూ శపించారట. అయితే మొదట ఈ ఉత్తరాలని శశికళ చదివేవారంట కానీ.. ఇప్పుడు చదవడంలేదని పోలీసు అధికారులు తెలిపారు.


