శశికళ ఆస్తులపై దాడులు..జయలలిత నమ్మినబంటు కారణమా...!

 

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్సి శశికళ ఆస్తులపై.. ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడులు దేశ వ్యాప్తంగా పలు సంచలనమే సృష్టించింది. అంతేకాదు ఐటీ దాడుల్లో కొన్ని కోట్ల ఆస్తులు కూడా బయటపడ్డాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ దాడుల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడట. అదెవరో కాదు..  జయలలిత సహాయకుడు 'పూంగుండ్రన్' అనే వ్యక్తట. అతను ఎవరూ..?ఏంటి.. ?ఈ దాడుల వెనుక అతని హస్తం ఏంటీ అన్న విషయాలు తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

 

పూంగుండ్రన్.. ఎన్నో ఏళ్లుగా జయలలితకు నమ్మినబంటుగా ఉన్నాడు. అన్నాడీఎంకెలో జయలలిత అధికారంలోకి వచ్చినప్పటినుండీ.. పెరుగుతూ పూంగుండ్రన్ ఆమె సహాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడట. అంతేకాదు అతని తండ్రి శంకరలింగం జయలలితకు స్పీచ్ కూడా రాసి ఇచ్చేవాడట. ఇక జయలలిత పోయస్ గార్డెన్స్ అయితే పూంగుండ్రన్ హలా బాగానే కొనసాగిందట. ఎవరూ ఫోన్ చేసినా.. ఎంతటి వారైనా సరే.. ముందు పూంగుండ్రన్ తో విషయం చెబితేనే.. ఆ తర్వాత జయలలిత వారితో మాట్లాడేవారట.  జయలలిత పార్టీ వ్యవహారాలతో పాటు, ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయాలను పూంగుండ్రన్ చాలా దగ్గరిగా పరిశీలించేవాడట.

 

అయితే ఇదంతా శశికళ ఎంట్రీ ఇవ్వకముందట. ఇక ఎప్పుడైతే శశికళ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి పూంగుండ్రన్ పాత్ర తగ్గిపోయిందట. ఆతరువాత శశికళను జయలలతి బయటకు పంపడం.. ఎలాగో అలా మళ్లీ పోయెస్ గార్డెన్ కు రావడం జరిగిపోయింది. ఇక ఈ క్రమంలో శశికళ పూంగుండ్రన్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇది ఒకప్పటి స్టోరీ.. ఇక ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులపై దాడులు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఐటీ అధికారులు...  ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటే వివరాలన్ని బయటపడుతాయో అన్నది ఆరా తీశారు. ఈ క్రమంలో పూంగుండ్రన్ పేరే వారికి ప్రధానంగా కనిపించింది. దీంతో ముందు అక్కడినుండే నరుక్చొచారు ఐటీ అధికారులు. తీగ లాగితే డొంగ కదిలినట్టు.. ముందుగా పూంగుండ్రన్‌ కార్యాలయంపై ఐటీ దాడులు చేయగా.. అందులో అసలు విషయాలు బయటపడ్డాయి.. దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ కేంద్రంగా జరిగిన ఆస్తుల కొనుగోళ్లు, పంపకాలు, బినామీలు, బినామీ కంపెనీల వ్యవహారాలు వంటి విషయాలన్ని పూంగుండ్రన్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆ ఆధారాలతోనే ఏకకాలంలో ఐటీ అధికారులు 200ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇంకా కొన్ని చోట్ల ఐటీ అధికారులు దాడి జరిపే అవకాశం ఉంది. చూద్దాం.. ఇంకా ఎన్ని కోట్ల ఆస్తులు బయటపడతాయో.