శశికళ ఆస్తులపై మూకుమ్మడి దాడి...

 

అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ ఇప్పటికే బెంగుళూరూలోని పరప్పన జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహించారు. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లలోని 187 ఆస్తులపై ఒకేసారి ఐటీశాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఇందులోని 40 చోట్ల దాడులు పూర్తికాగా, మిగిలిన చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేసినట్లు ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు అలాగే శశికళ కుటుంబ సభ్యుల ఇళ్ళు, అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన అసమ్మతి నేతల నివాసాల్లో అధికారులు మూకుమ్మడి సోదాలు చేపట్టారు. పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడం వల్లే సోదాలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు.