జైల్లో కూడా సేమ్ సీన్ రిపీట్....
Published on: Wed Mar 8, 2017 9:26AM
.jpg)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమెకు ఇచ్చిన గౌరవాన్నే ఆమె నెచ్చెలి అయిన శశికళకు ఇచ్చారు పార్టీ నేతలు. ఎలాగైతే జయలలిత పాదాభివందనాలు చేసేవారో.. అలాగే శశికళకు కూడా పాదాభివందనాలు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం శశికళ జైల్లో ఉన్నా కానీ పార్టీ నేతలకు ఆమెపై ఉన్న గౌరవం మాత్రం తగ్గినట్టు లేదనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెను కలవడానికి మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు వీరు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారు. అనంతరం వీరు తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. దీంతో జైల్లో కూడా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది.


