ఎన్నారైలు భారత్‌ను పటిష్టం చేయాలి:శశిథరూర్
Published on: Mon Jan 9, 2012 7:34AM
జైపూర్: దేశ మౌళిక రంగాలను పటిష్టం చేసేందుకు విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాస భారతీయులకు మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ పిలుపునిచ్చారు. జైపూర్‌లో ప్రారంభమైన 10వ ప్రవాస భారతీయ దివస్‌లో శశిథరూర్ మాట్లాడారు. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్య రంగాలలో ప్రపంచ స్థాయి నిపుణులను భారతీయ విద్యా వ్యవస్థ అందించిందన్నారు. అయితే దేశ జనాభాలో మూడవ వంతు మంది నిరక్ష్యరాస్యులున్నారని థరూర్ వెల్లడించారు. ప్రవాస భారతీయులు తమ అనుభావాలతో దేశంలోని వివిధ రంగాలను పటిష్టం చేయాలన్నారు.ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడానికి ప్రవాస భారతీయులు కృషి చేయాలని.ప్రత్యేకంగా వ్యాపార సంబంధమైన విద్యను అందించాలని ఆయన ప్రవాసీయులకు విజ్ఞప్తి చేశారు.


