TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పుడే ఎక్కువ ఆశించడం సరికాదు: పాక్

Published on: Mon Dec 28, 2015 6:40AM

 

భారత ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటన తరువాత ఇరు దేశాల మధ్య మళ్ళీ సానుకూలవాతావరణం ఏర్పడింది. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో ఇరుదేశాల విదేశాంగ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిపేందుకు వారు అంగీకరించారు. మారిన ఈ పరిస్థితులను చూసి ఇరుదేశాల ప్రజలలలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. భారత్-పాక్ మధ్య నెలకొన్న సమస్యలన్నీ వెంటనే కాకపోయినా ఒకటొకటిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. కానీ అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరికాదని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ అన్నారు.

 

ఆయన ‘రేడియో పాకిస్తాన్’తో మాట్లాడుతూ “విదేశాంగ ప్రధాన కార్యదర్శుల మొదటి సమావేశంతోనే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరి కాదు. మొదట రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి సరిహద్దుల వద్ద ప్రశాంతత నెలకొనేలా చేయడం ద్వారా ఇరుదేశాలలో సరిహద్దు గ్రామాలలో నివసించేప్రజలకు ప్రశాంతత సమకూర్చాలని భావిస్తున్నాము,” అని తెలిపారు. అంటే జనవరిలో జరుగబోయే విదేశాంగ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ‘సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ’ ప్రధాన అజెండాగా ఉండబోతోందని భావించవచ్చును.