TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్‌ సర్దార్‌ను టీడీపీ కాపు కాసిందా?

Published on: Sat Apr 9, 2016 2:58PM

ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అనుకున్నట్టే భారీ ఓపెనింగ్, అభిమానుల హంగామా అన్ని కామనే. ఈ బాండ్ భజా వెనుక తెలుగుదేశం హస్తం కూడా ఉందని విశ్లేషకుల అంచనా. టీడీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి జనసేన అధినేత పవన్ ఎంత సపోర్ట్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత జనసేన-టీడీపీ బంధం బాగా స్ట్రాంగ్ అయ్యింది. రాజధానికి భూసేకరణ తదితర విషయాల్లో జనం నుంచి వ్యతిరేకత రాకుండా  చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించకుండా పవన్ సహాయపడ్డారు. టీడీపీకి ఎంతో సాయం చేసి పార్టీకి పూర్తి వెన్నుదన్నుగా నిలిచిన పవన్‌ రుణం తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు టైం రానే వచ్చింది. అదే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీనికి ఇరు రాష్ట్రాల్లో టీడీపీ నాయకుల మద్దతు లభించింది. తెలుగుదేశం కంచుకోటలైన విజయవాడ, గుంటూరు నగరాల్లో థియేటర్లు లభించడానికి అర్థరాత్రి షోలు, స్పెషల్ షోలు వేసేందుకు అక్కడి నాయకులు తమ వంతుగా సాయం చేశారు. ఈ విధంగా సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా టీడీపీ ఫుల్ సపోర్ట్ చేసిందని సినీ, రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.