శరద్ యాదవ్ కు ఝలక్ ఇచ్చిన నితీశ్..

 

నితీశ్ కుమార్ సీనియర్ నేత శరద్ యాదవ్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ ను రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుండి తొలగించారు. దీనిని జేడీయూ అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారాన్ని కొత్తగా ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడికి తెలియజేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొత్త ప్రతినిధిగా నితీశ్ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంతకు ముందు మరో రాజ్యసభ సభ్యుడు అన‍్వర్ అలీపై కాంగ్రెస్‌ నిర్వహించిన బీజేపీ వ్యతిరేక సమావేశంలో పాల్గొనటంతో వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా శరద్ యాదవ్ పార్టీపై బహిరంగంగానే విమర్సలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు శరద్ యాదవ్ నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.