జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి మర్డర్ కేసులో సంతోష్ అరెస్ట్
Published on: Thu Oct 24, 2024 10:59AM
కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి ముఖ్య అను చరుడు గంగారెడ్డి హంతకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అందరూ అనుమానిస్తున్న సంతోష్ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల క్రితం జగిత్యాలలో 58 ఏళ్ల గంగారెడ్డి హత్యకు గురయ్యాడు. హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి జగిత్యాల బస్టాండ్ లో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానని మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని నిలదీశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల మర్డర్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆధారాలను సేకరించిన పోలీసులకు సంతోష్ హత్యకు పాల్పడినట్లు తేలింది. హంతకుడు సంతోష్ అని పోలీసులు ధృవీకరించారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సంతోష్ అరెస్టయ్యాడు అయితే జీవన్ రెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.


