టీ 20 ప్రపంచ కప్ జట్టు నుంచి సంజూ శాంసన్ ఔట్?
Published on: Tue Feb 3, 2026 11:28AM

అందివచ్చిన అవకాశాలను చేజేతులా చేజార్చుకున్న టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మాన్ సంజుశాంసన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో సంజుకి భారత్ తుది జట్టులో చోటు దక్కకపోతే సోషల్ మీడియాలో అతని అభిమానులు తెగ చెలరేగిపోయేవారు.
అంత ప్రతిభావంతుడ్ని ఎలా పక్కనపెడతారని ప్రశ్నలు సంధించేవారు. రెండు నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌లో అతడిని తుది జట్టునుంచి పక్కన పెట్టినప్పుడూ అలాగే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. కానీ తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిశాక సంజు ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. న్యూజిలాండ్‌తో టీ 20 అయిదు వన్డేల సిరీస్‌లో సంజూ తీవ్రంగా నిరాశపరిచాడు. 10, 6 , 0, 24, 6 స్కోర్లతో అన్ని మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
దాంతో ప్రపంచకప్ తుది జట్టుకు అతను దాదాపు దూరమయ్యాడనే చెప్పాలి. డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌కు సంజుని పక్కన పెట్టి శుభమన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించారు. కానీ గిల్ కూడా నిలకడగా రాణించకపోవడంతో ఆ తర్వాత గిల్ పై వేటు పడింది. సంజుని టి20 ప్రపంచకప్ కోసం ఓపెనర్‌గా ఎంపిక చేశారు. దాని కంటే ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో ఓపెనర్‌గా ఆడించారు. ఈ సిరీస్‌తోనే అతడు తన కెరీర్‌ని ప్రమాదంలోకి నెట్టుకున్నాడు


